పరిపాలనా వికేంద్రీకరణకు వ్యతిరేకంగా రాజధాని గ్రామాల్లో నిరసనల హోరు కొనసాగుతోంది. ప్రభుత్వ నిర్ణయంపై రాష్ట్రవ్యాప్త వ్యతిరేకతను ముఖ్యమంత్రి కనీసం గమనించట్లేదంటూ మందడం రైతులు అన్నారు. పాలనకు అవసరమైన అన్ని భవనాలూ ఉన్న అమరావతి నుంచి రాజధాని తరలింపు నిర్ణయం రాష్ట్రాభివృద్ధికి గొడ్డలిపెట్టేనని మండిపడుతున్నారు.
మహిళల సంఘీభావం
విజయవాడ ధర్నాచౌక్‌లో రాజధాని రైతుల దీక్షకు మద్దతుగా మహిళలు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. తాడికొండ నుంచి వందలాదిమంది మహిళలు ట్రాక్టర్లపై తుళ్లూరు చేరుకుని అక్కడి నుంచి వెలగపూడి, మందడం వరకూ ర్యాలీగా తరలివచ్చారు. 3 రాజధానులు వద్దు ఒక రాజధాని ముద్దంటూ నినాదాలు చేశారు. ఉద్దండరాయనిపాలెంలో కాలభైరవ యాగం చేసిన శివస్వామికి మహిళలు కృతజ్ఞతలు తెలిపారు. నెలకుపైగా ఆందోళనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఉలుకూపలుకూ లేదని మండిపడ్డారు. వికేంద్రీకరణ బిల్లును మండలి ఛైర్మన్ సెలెక్ట్ కమిటీకి పంపి రైతుల ఉద్యమానికి ఊపిరి పోశారన్నారు.
విద్యార్థులు సైతం..