ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాజధాని ఒకే ప్రాంతంలో ఉండాలి: టీజీ వెంకటేశ్ - టీజీ వెంకటేశ్ వార్తలు

మూడు రాజధానుల నిర్ణయం సరైంది కాదని భాజపా ఎంపీ టీజీ వెంకటేశ్ అభిప్రాయపడ్డారు. రాజధానిని ఒకే ప్రాంతంలో ఉంచి మిగిలిన రెండు చోట్ల మినీ సచివాలయం, హైకోర్టు బెంచ్ వంటివి ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. దక్షిణాఫ్రికాలోనూ ప్రధాన కార్యాలయాన్ని ఒకే ప్రాంతంలో ఉంటాయని ఉదహరించారు. మూడు ముక్కలాట నడవదని వ్యాఖ్యానించారు.

tg venkatesh
tg venkatesh

By

Published : Feb 3, 2020, 6:25 PM IST

మూడు రాజధానుల నిర్ణయం సరైంది కాదన్న టీజీ వెంకటేశ్

రాజధానిని ఒకే ప్రాంతంలో ఏర్పాటు చేయాలని భాజపా ఎంపీ టీజీ వెంకటేశ్ అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ మంచిదే అన్న ఆయన... రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది సరి కాదని అన్నారు. రాజధానిని ఒక్క ప్రాంతంలోనే ఉంచి... మిగిలిన రెండు ప్రాంతాల్లో మినీ సచివాలయం, హైకోర్టు బెంచ్, శీతాకాల సమావేశాలు ఏర్పాటు చేయాలని కోరారు. అంతేకానీ మూడు ముక్కలాట వద్దని అన్నారు. దక్షిణాఫ్రికాలోనూ ప్రధాన కార్యాలయాలన్నీ ఒకే చోట ఉంటాయని వెల్లడించారు. కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయడం అంత సులభం కాదన్న ఆయన... హైకోర్టు బెంచ్​ను మాత్రం త్వరితగతిన ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నారు. వీటితో పాటు చైనాలోని వూహాన్​లో చిక్కుకున్న కర్నూలు జిల్లా యువతిని భారత్​కు తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని ఎంపీ వెల్లడించారు. యువతి కుటుంబానికి అన్ని విధాలా సాయమందిస్తామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details