ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మీ ఇంటికి కరెంటు నిలిపివేస్తున్నాం, సీఎండీ ప్రభాకరరావుకి సైబర్‌ నేరగాళ్ల మెసేజ్‌ - hyderabad latest crime news

CYBER FRAUD ఓటరు గుర్తింపుకార్డు.. ఆధార్‌ మార్పులు.. బహుమతులు.. వివాహ పరిచయ వేదికలు కావేవీ మోసానికి అనర్హం అన్నట్టుగా సైబర్‌ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త మార్గాలను ఎంచుకొని జనాన్ని తేలికగా బురిడీ కొట్టిస్తున్నారు. ప్రస్తుతం సైబర్‌ నేరస్తులు విద్యుత్‌ బిల్లులు బకాయిలు చెల్లించాలంటూ మోసాలకు తెరలేపారు. వెంటనే చెల్లించకపోతే రాత్రికి రాత్రే విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తామంటూ ఫేక్‌ మెసేజ్‌లు పంపిస్తున్నారు. తాజాగా ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకరరావుకూ ఇలాంటి సందేశమే వచ్చింది. అప్రమత్తమైన ఆయన దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సైబర్‌ నేరగాళ్ల మెసేజ్‌
సైబర్‌ నేరగాళ్ల మెసేజ్‌

By

Published : Aug 24, 2022, 9:39 AM IST

CYBER FRAUD: ‘డియర్‌ కస్టమర్‌, గత నెల కరెంట్‌ బిల్లు చెల్లించనందుకు ఈ రోజు రాత్రి 9.30 గంటల తర్వాత మీ కరెంట్‌ సరఫరా నిలిపేస్తున్నాం. ఈ నంబర్‌కు కాల్‌ చేయండి’ అని వస్తున్న ఫేక్‌ మెసేజ్‌లు విద్యుత్తు వినియోగదారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకరరావుకూ ఇలాంటి సందేశమే వచ్చింది. అప్రమత్తమైన ఆయన దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే పదుల సంఖ్యలో కేసులు సీసీఎస్‌లో నమోదయ్యాయి.

కొందరు సైబర్‌ నేరగాళ్ల మాటలు నిజమని నమ్మి డబ్బు పోగొట్టుకున్నారు. తాము ఇలాంటి సందేశాలు పంపించమని.. వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details