ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణలో జలపాతాలు కళకళ - adilabad district waterfalls

తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో జలపాతాలు హొయలొలుకుతున్నాయి. తొలకరి జల్లులకు అడవుల జిల్లాలోని జలపాతాలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. కరోనా వ్యాప్తి దృష్ట్యా అనుమతి లేకపోవడం వల్ల ప్రకృతి ప్రేమికులు ఈ ఆనందాన్ని మిస్ అవుతున్నారు.

waterfalls
జలపాతాలు

By

Published : Jun 15, 2021, 9:58 AM IST

జలపాతాలు

తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లా అడవులు జలపాతాల సవ్వడితో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఆ రాష్ట్రంలో ఎత్తైన జలపాతంగా పేరుగాంచిన కుంటాల.. తొలకరి జల్లులకే.. ప్రకృతి ఒడిని పులకింపజేస్తోంది.

కుంటాల మండలంలోనే గుత్పలా జలపాతం ప్రకృతి ప్రేమికులను పరవశింపజేస్తోంది. బోథ్ మండలంలోని పొచ్చర జలపాతం హోయలొలికే నీటిధారతో కనువిందు చేస్తోంది. అయితే కరోనా కారణంగా ప్రస్తుతం పర్యాటకులను జలపాతాల వద్దకు అనుమతించడం లేదు.

ABOUT THE AUTHOR

...view details