ఎగువ నుంచి వస్తున్న ప్రవాహం కారణంగా ప్రకాశం బ్యారేజీ నుంచి ఇవాళ కూడా అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. మొత్తం 20 గేట్ల ద్వారా 8340 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచి పెడుతున్నారు. ప్రకాశం బ్యారేజీలో ప్రస్తుతం 3.07 టీఎంసీల పూర్తిస్థాయి నీటి నిల్వలు ఉండటంతో.. అదనపు నీటిని నిల్వ చేయలేని పరిస్థితి ఉన్నందున సముద్రంలోనికి విడుదల చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 39,700 క్యూసెక్కుల నీటి ప్రవాహం వచ్చింది. ఈ ప్రాజెక్టు వద్ద తెలంగాణా విద్యుత్ ఉత్పత్తితో 7200 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల అవుతోంది. ఇక నాగార్జున సాగర్ జలాశయం వద్ద విద్యుత్ ఉత్పత్తి కారణంగా 62,446 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల అవుతోంది. శ్రీశైలం నుంచి 21,229 క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నారు.