శ్రీశైలం జలాశయానికి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. 10 గేట్లు ఎత్తి సాగర్‌కు నీటి విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 4,62,390 క్యూసెక్కులు.. ఔట్‌ఫ్లో 3,45,054 క్యూసెక్కులుగా నమోదవుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం.. 884.40 అడుగులమేర నీళ్లు చేరాయి. పూర్తి స్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలకు.. 210 టీఎంసీల వరకు జలాశయంలో నీళ్లు చేరాయి. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగనుంది.
ఇలాంటి ప్రకృతి అందాన్ని చాలా అరుదుగా చూస్తుంటాం. 2, 3 గేట్లు చూస్తేనే ఆనందిస్తాం. అలాంటిది ఇవాళ 10 గేట్లు ఎత్తి నీటిని వదలడం చూసి.. మరింత ఆనందం కలుగుతోంది. ఇక్కడి నుంచి వెళ్లాలని మాకు అనిపించడం లేదు. వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంది. - జలాశయం వద్ద పర్యటకులు