తెలంగాణ రాష్ట్రంలోని జూరాల జలాశయం నిండుకుండను తలపిస్తోంది. జలాశయం పూర్తి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 8.512 టీఎంసీలుగా ఉంది. జూరాల జలాశయం నిండుతుండటంతో నెట్టెంపాడుకు 750 క్యూసెక్కులు, బీమాకు 650 క్యూసెక్కులు, కోయిల్ సాగర్‌కు 151, కుడి కాలువకు 112, ఎడమ కాలువకు 390 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 4,145 క్యూసెక్కులు ఉంది.
జూరాల జలాశయంలో పెరుగుతున్న నీటి మట్టం - jurala reservoir latest updates
ఇటీవల కురిసిన వర్షాలకు తెలంగాణ రాష్ట్రంలోని జూరాల జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జలాశయం పూర్తి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 317.950 మీటర్లకు చేరింది.

జూరాల జలాశయంలో పెరుగుతున్న నీటి మట్టం