ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో తెలంగాణలోని ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు వద్ద గోదావరి వరద పరవళ్లు తొక్కుతోంది. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో పాటు చత్తీస్గఢ్, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురువడం వల్ల రెండు రోజుల నుంచి గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం పేరూరు వద్ద 31 అడుగులకు వరద నీరు చేరుకుంది. గురువారం ఉదయానికి వరద నీటి ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
జోరువానలు.. ఉద్ధృతంగా గోదావరి పరుగులు - heavy rains
భారీ వర్షాలతో తెలంగాణలోని ములుగు జిల్లా పేరూరు వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం 31 అడుగులకు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
water-flow-rised