ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Water Bill in Online Hyderabad: ఇక నుంచి ఆన్​లైన్​లోనే.. నీటి బిల్లులు

Water Bill in Online Hyderabad : హైదరాబాద్​లో ఇక నుంచి నీటి బిల్లుల కోసం ఇంటింటికీ, పరిశ్రమల వద్దకు వెళ్లే విధానానికి జలమండలి ముగింపు పలకనుంది. నీటి బిల్లుల జారీ, చెల్లింపులు ఇక నుంచి పూర్తిగా ఆన్​లైన్​ విధానంలో అందుబాటులోకి తీసుకురానుంది. ఏప్రిల్ 1 నుంచి పూర్తిస్థాయిలో ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపింది.

Water Bill in Online Hyderabad
Water Bill in Online Hyderabad

By

Published : Dec 23, 2021, 4:51 PM IST

Water Bill in Online Hyderabad : హైదరాబాద్​లో నీటి బిల్లుల జారీ.. చెల్లింపుల్లో పారదర్శకతపై జలమండలి దృష్టిసారించింది. ఇక ఇంటింటికి, అపార్ట్‌మెంట్‌కు, పరిశ్రమల వద్దకు వెళ్లి బిల్లులు జారీ చేసే విధానానికి స్వస్తి పలకనుంది. బిల్లుల జారీ నుంచి.. వసూలు వరకు పూర్తి స్థాయిలో ఆన్‌లైన్‌ విధానంలో చేయనున్నారు. జలమండలి డివిజన్‌ కార్యాలయాల వద్ద నగదు చెల్లింపులు, చెక్కులు తీసుకోవడం తదితర విధానాలు మున్ముందు అందుబాటులో ఉండవు.

ఏప్రిల్ 1 నుంచి పూర్తిస్థాయి అమలు..
Water Bill Payment in Online : తొలుత వాణిజ్య నల్లాలకు జనవరి 1వ తేదీ నుంచి ఈ ప్రక్రియ అమల్లోకి రానుంది. ఏప్రిల్‌ 1 నుంచి పూర్తి స్థాయిలో ఈ విధానం చేపట్టనున్నట్లు జలమండలి ఎండీ దానకిషోర్‌ తెలిపారు. ఖైరతాబాద్‌ జలమండలి ప్రధాన కార్యాలయంలో సీజీఎంలు, జీఎంలతో రెవెన్యూ అంశాలపై బుధవారం ఆయన సమీక్షించారు.

మోసాలకు అడ్డుకట్ట..
Water Bill through Online : ఆన్‌లైన్‌ విధానంలో బోర్డు ఆదాయం పెరగడంతోపాటు మోసాలకు కూడా అడ్డుకట్ట పడనుంది. గ్రేటర్‌ వ్యాప్తంగా 12 లక్షల నల్లాలు ఉన్నాయి. ఇందులో 70 శాతం నల్లాలు గృహాలకు సంబంధించినవి. వీటి నుంచి రూ.36 కోట్లు వరకు ఆదాయం వస్తోంది. వాణిజ్య నల్లాల నుంచి రూ.70-80 కోట్లు ఆదాయం సమకూరుతోంది. ప్రతి వాణిజ్య నల్లాకు మీటర్‌ ఉండేలా చర్యలు తీసుకోవాలని ఎండీ ఆదేశించారు.

ఆన్​లైన్​లో బిల్లు వసూళ్లు..
Water Bill Payment through Online : ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా ఇప్పటికే అన్ని పైప్ సైజ్​లు కలిగిన వాణిజ్య కనెక్షన్లను గుర్తించి, జియో ట్యాగింగ్ చేసినట్లు దాన కిశోర్ తెలిపారు. ఈ కనెక్షన్లకు ఆన్​లైన్​లో బిల్లులు జారీ చేసి, డిజిటల్ పద్ధతిలో వసూలు చేసే విధానంపై ఇప్పటికే అధికారుల కమిటీ వేసి అధ్యయనం చేయించినట్లు వెల్లడించారు. వాణిజ్య కనెక్షన్లకు ఈమెయిల్, ఎస్ఎంఎస్, వాట్సాప్ వంటి మాధ్యమాల ద్వారా పూర్తిగా ఆన్​లైన్​లో బిల్లులు జారీ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ బిల్లులు కూడా ఆన్​లైన్​లోనే వసూలయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

వారిపై ప్రత్యేక దృష్టి..
JalaMandali : మీటరు పని చేయని, మీటరు లేని వాణిజ్య, హైవాల్యూ కనెక్షన్లకు కచ్చితంగా మీటరు ఉండేలా చూడాలని జలమండలి ఎండీ.. అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి లోపు కచ్చితంగా ఏఎంఆర్ మీటర్లు అమర్చుకునేలా చూడాలని చెప్పారు. వాణిజ్య కనెక్షన్ల బకాయిలను పూర్తిస్థాయిలో వసూలు చేయాలని సూచించారు. ఇంతవరకు బిల్లులు చెల్లించని కనెక్షన్లపై ప్రత్యేక దృష్టి సారించాలని, కచ్చితంగా వాళ్లు బిల్లులు చెల్లించేలా చూడాలని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details