ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 4, 2021, 4:53 PM IST

Updated : Jan 4, 2021, 5:45 PM IST

ETV Bharat / city

న్యాయవ్యవస్థ ప్రతిష్ఠ పెంచేలా పని చేయాలి: జస్టిస్ మహేశ్వరి

cj-justice-jk-maheshwari
cj-justice-jk-maheshwari

16:48 January 04

వీడ్కోలు సమావేశంలో భావోద్వేగానికి లోనైన జస్టిస్‌ మహేశ్వరి

న్యాయవ్యవస్థ ప్రతిష్ఠ పెంచేలా పని చేయాలి: జస్టిస్ మహేశ్వరి

రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్ జేకే మహేశ్వరికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. సామాన్య కుటుంబం నుంచి ఈ స్థాయికి వచ్చానని తెలిపారు. వ్యక్తులు వస్తుంటారు, వెళ్తుంటారు.. కానీ వ్యవస్థల ఔన్నత్యం కాపాడాలన్నారు. ఒక్కోసారి రాత్రి 10 వరకు కూడా పనిచేయాల్సి వచ్చిందనే విషయాన్ని గుర్తు చేసుకున్నారు.  అందరి సహకారంతోనే సమర్థవంతంగా విధులు నిర్వహించానని పేర్కొన్నారు. సహచర జడ్జిలు, సిబ్బంది అభిమానం మరచిపోలేనని... న్యాయవ్యవస్థ ప్రతిష్ఠ పెంచేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు. అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నానని ఆకాంక్షించారు.  వీడ్కోలు ఎప్పుడూ బాధాకరంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. వీడ్కోలు సమావేశంలో... సహచరులు, సిబ్బందిని జస్టిస్ మహేశ్వరి ఆలింగనం  చేసుకున్నారు. 

ఇదీ చదవండి

టీకా​ కోసం ఈ వారమే భారత్​ బయోటెక్​తో ఒప్పందం

Last Updated : Jan 4, 2021, 5:45 PM IST

ABOUT THE AUTHOR

...view details