తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ అర్బన్, వరంగల్ గ్రామీణ జిల్లాలు హన్మకొండ, వరంగల్ జిల్లాలుగా మార్పు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. ఇటీవల వరంగల్ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు జిల్లాల పేర్లు, స్వరూపం మార్పును ప్రతిపాదించారు. హన్మకొండ, పరకాల రెవెన్యూ డివిజన్లతో ఉండే హన్మకొండ జిల్లాలో 12 మండలాలు ఉంటాయి.
వరంగల్, నర్సంపేట రెవెన్యూ డివిజన్లతో వరంగల్ జిల్లాలో 15 మండలాలు ఉంటాయి. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. అభ్యంతరాలు, వినతులకు నెలరోజులు గడువు ఇచ్చింది. నెల రోజుల్లోపు వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ కలెక్టర్లకు అభ్యంతరాలు, వినతులు ఇవ్వాలని తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
హన్మకొండ జిల్లాలోని మండలాలు
- హన్మకొండ
- ఖాజీపేట
- ఐనవోలు
- హసన్ పర్తి
- వేలేరు
- ధర్మసాగర్
- ఎల్కతుర్తి
- భీమదేవరపల్లి
- కమలాపూర్
- పరకాల
- నడికుడ
- దామెర