Swine Flu In Warangal: వరంగల్‌లోని జాతీయ సాంకేతిక విద్యాసంస్థ (నిట్)లో స్వైన్ ఫ్లూ కలకలం సృష్టించింది. కళాశాలకు చెందిన బీటెక్ విద్యార్థికి జ్వరం, వాంతులు వంటి లక్షణాలు కనిపించడంతో శుక్రవారం రాత్రి హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. వ్యాధి లక్షణాలను గుర్తించిన వైద్యులు.. హెచ్1ఎన్1 పరీక్షలు నిర్వహించగా స్వైన్ ఫ్లూ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని వెంటనే జిల్లా వైద్యాధికారులకు తెలియజేశారు.
వరంగల్ నిట్‌లో స్వైన్ ఫ్లూ కలకలం.. అధికారులు అప్రమత్తం - శానిటేషన్
Swine Flu :తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా నిట్‌లో స్వైన్‌ఫ్లూ కలకలం రేగింది. ఓ విద్యార్థికి జ్వరం, వాంతులు వంటి లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించగా.. స్వైన్ ఫ్లూ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దాంతో అధికారులు అప్రమత్తమయ్యారు. హాస్టల్ పరిసరాల్లో శానిటేషన్ చేయించారు.
వరంగల్ జిల్లా నిట్‌లో స్వైన్ ఫ్లూ
అధికారులు మున్సిపల్ శాఖకు సమాచారం అందించడంతో వారు నిట్‌లోని విద్యార్థి తరగతి గది, హాస్టల్ పరిసరాల్లో శానిటేషన్ చేయించారు. వైద్యశాఖ అధికారులు నిట్ డిస్పెన్సరీలో వివరాలు సేకరించారు. స్వైన్ ఫ్లూ బారినపడ్డ విద్యార్థి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. కళాశాలలో ఇతర విద్యార్థులకు ఏమైనా లక్షణాలు ఉన్నాయా అనే కోణంలో వివరాలను సేకరించారు. ఫ్లూ బాధిత విద్యార్థి ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నట్లు వారు తెలిపారు.
ఇవీ చదవండి: