కొవిడ్ నియంత్రణకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోందని తెలంగాణ వైద్య శాఖ కార్యదర్శి రిజ్వి తెలిపారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్టు వివరించారు. హైదరాబాద్ నగర పరిధిలో ఉన్నవారికి ఎలాంటి కొవిడ్ లక్షణాలున్నా... వైద్య సలహాలు, సూచనలకు, కావాల్సిన వైద్య కిట్ల కోసం 040-2111-1111 నెంబర్‌కు ఫోన్ చేయాలని పేర్కొన్నారు. ప్రస్తుతం 104 కు వచ్చే కాల్స్‌ను కూడా కొవిడ్ కంట్రోల్ రూమ్ నెంబర్‌కు అనుసంధానం చేస్తున్నట్లు రిజ్వి తెలిపారు.
'కొవిడ్ లక్షణాలుంటే వెంటనే టెస్టులు, స్కాన్లంటూ వెళ్లొద్దు' - ghmc covid control room
కొవిడ్ నియంత్రణకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోందని...తెలంగాణ రాష్ట్ర వైద్య శాఖ కార్యదర్శి రిజ్వి తెలిపారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్టు వివరించారు.
కొవిడ్ లక్షణాలుంటే వెంటనే టెస్టులనీ, స్కానింగ్లనీ వెళ్లొద్దని... ముందస్తుగా 5 రోజులపాటు మందులు వాడాలని వైద్య శాఖ ఓఎస్డీ గంగాధర్ సూచించారు. అవసరమైన వారికి జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయాల ద్వారా మెడికల్ కిట్లను అందిస్తున్నట్లు చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్‌లో కొవిడ్ సంబంధిత వైద్య సహాయాన్ని, కొవిడ్ పాజిటివ్ వస్తే చేపట్టాల్సిన జాగ్రత్తలు, తీసుకోవాల్సిన మందులు తదితర సలహాలు సూచనల కోసం జీహెచ్ఎంసీ కొవిడ్ కంట్రోల్ రూమ్ నుంచి వైద్యులను ప్రత్యేకంగా నియమించారు. ప్రతీరోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తిరిగి రెండు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రెండు విడతల్లో వైద్యులు కంట్రల్ రూమ్ నుంచి ఫోన్లో అందుబాటులో ఉంటారని తెలిపారు.
కంట్రోల్ రూమ్‌లో విధులు నిర్వర్తించే వైద్యులకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక ఓరియెంటేషన్ కార్యక్రమం వైద్యశాఖ కార్యదర్శి రిజ్వి నిర్వహించారు. కార్యక్రమానికి సీనియర్ ఐఏఎస్ అధికారి రాహుల్ బొజ్జా, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, వైద్య శాఖ ఓఎస్డీ గంగాధర్‌లు హాజరయ్యారు. అనంతర జీహెచ్ఎంసీ కొవిడ్ కంట్రోల్ రూమ్‌ను వైద్య శాఖ కార్యదర్శి రిజ్వి సందర్శించారు. కంట్రోల్ రూమ్ పని తీరు గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
ఇదీ చూడండి:
ఇవాళ కేబినెట్ భేటీ.. చర్చించే అంశాలివే
TAGGED:
ghmc covid control room