తెలంగాణలోని భద్రాద్రిలో పులి అడుగు జాడలు కలకలం రేపుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం కృష్ణసాగర్, సారపాక ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు కొందరు స్థానికులు చెబుతున్నారు. బూర్గంపహాడ్ మండలం సారపాక పుష్కరవనం అడవి నుంచి నాగినేనిప్రోలు, రెడ్డిపాలెం వైపు రోడ్డు దాటినట్లు తెలిపారు.
భద్రాచలం ఏజెన్సీలో పులి సంచారం...! - భద్రాద్రి కొత్తగూడెం లేటెస్ట్ న్యూస్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. బూర్గంపహాడ్ మండలంలోని పలు ప్రాంతాల్లో పులి సంచరించినట్లు స్థానికులు చెబుతున్నారు. పులి ఆచూకీ కోసం అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
wandering-tiger
సారపాక ప్రాంతాల్లో పులి ఆచూకీ కోసం అటవీశాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. పులి అడుగులను గుర్తించారు. సారపాక, రెడ్డిపాలెం, సందేళ్ల, రామాపురం, ముసలిమడుగు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఇదీ చదవండి:ఖమ్మం జిల్లాలో రైతులను హడలెత్తించిన హైనా