ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ హుజూర్​నగర్​లో ఓటరు చైతన్యం.. పెరిగిన పోలింగ్

కాంగ్రెస్​, తెరాస పార్టీలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న తెలంగాణలోని సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్ అసెంబ్లీ​ ఉపఎన్నిక పోలింగ్​ ముగిసింది. ఓటర్లు ఉత్సాహంగా ఓటేశారు. ప్రారంభంలో కొన్నిచోట్ల ఈవీఎంల, వీవీప్యాట్​ల మొరాయించడం మినహా ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రశాంతంగా ఓటింగ్​ ముగిసింది. సాయంత్రం ఐదు గంటల వరకు 84.15 పోలింగ్​ శాతం నమోదైంది.

హుజూర్​ నగర్​లో ఓటరు చైతన్యం.. పెరిగిన పోలింగ్

By

Published : Oct 21, 2019, 11:42 PM IST

హుజూర్​ నగర్​లో ఓటరు చైతన్యం.. పెరిగిన పోలింగ్
తెలంగాణలోని హుజూర్ నగర్ ఉపఎన్నిక ముగిసింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య.. ఓటర్లు ఉత్సాహంగా ఓటేసేందుకు బారులు తీరారు. కీలకమైన ఈ స్థానం కోసం అధికార తెరాస, విపక్ష కాంగ్రెస్​లు తీవ్రంగానే శ్రమించాయి.

ఎవరెక్కడ నుంచి..

302 కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెరాస అభ్యర్థి సైదిరెడ్డి మఠంపల్లి మండలం గుండ్లపల్లిలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెదేపా అభ్యర్థి హుజూర్​నగర్​ ఎస్​పీ క్యాంపస్​ స్కూల్​లో ఓటేశారు.


ఈవీఎం మొరాయింపులు

మఠంపల్లి మండలం కేంద్రంలోని 79వ పోలింగ్​ బూత్​లో రెండు ఈవీఎంలు పదినిమిషాల పాటు మొరాయించాయి. పాలకీడు మండలం బెట్టెతండాలో వీవీప్యాట్​, బ్యాలెట్​ అనుసంధానంలో సమస్య తలెత్తెంది. నేరేడుచర్ల మండలం చింతబండలో ఈవీఎం కాసేపు ఇబ్బంది పెట్టింది. కొన్ని పోలింగ్​ కేంద్రాల్లో సరైన వెలుతురు లేక ఓటర్లు అవస్థలు పడ్డారు. చిన్న చిన్న ఘటనలు మినహా ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్​ శాఖ పటిష్ఠ భద్రత కల్పించింది.

పెరిగిన ఓటింగ్​
ఉదయం 7 గంటలకు పోలింగ్​ ప్రారంభమైంది. పోలింగ్​ ముగిసే సమయానికి 84.15 శాతం ఓట్లు పోలయ్యాయి. 2018 సాధారణ ఎన్నికల్లో 78.38 శాతం.. 2014లో 81.18 శాతం కంటే ఈసారి ఓట్ల సంఖ్య పెరిగింది. సాయంత్రం ఐదు గంటల వరకు క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటేసే అవకాశం కల్పించనుండడం వల్ల పోలింగ్​ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది. హుజూర్​నగర్​ మండలం అంబేడ్కర్ నగర్​లోని పాఠశాలలో సాయంత్రం ఆరున్నర వరకు ఓటేసేందుకు ఓటర్లు వేచి చూశారు.

ఇవీచూడండి: హుజూర్​నగర్​లో గులాబీ జెండా ఎగురుతుంది: కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details