జీహెచ్ఎంసీ పరిధిలోని జియాగూడలో ఓట్లు గల్లంతయ్యాయి. బూత్ నెంబర్ 36, 37, 38లలో అధిక సంఖ్యలో ఓట్లు గల్లంతయ్యాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సుమారు మూడు వేల ఓట్లు గల్లంతవ్వడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తెరాస, ఎంఐఎం పార్టీలతో అధికారులు కుమ్మక్కై ఓట్లను డిలీట్ చేయించారని స్థానికులు ఆరోపించారు.
తెలంగాణ: జియాగూడలో ఓట్ల గల్లంతు.. ఆందోళనలో ఓటర్లు
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఓట్ల గల్లంతు ఓటర్లలో గందరగోళం సృష్టిస్తోంది. జియాగూడలోని బూత్ నంబర్ 36, 37, 38 లలో ఏకంగా మూడువేల ఓట్లు గల్లంతయ్యాయి. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జియాగూడలో ఓట్ల గల్లంతు
సమాచారం అందుకున్న జోనల్ కమిషనర్.. సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులు తమ ఓట్ల గురించి ఆమెను ప్రశ్నించగా సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు.
ఇదీ చదవండి:'ధర్నా విరమించేది లేదు.. అవసరమైతే ప్రాణాలు వదిలేస్తాం'