కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 21 నుంచి 29వ తేదీదాకా జరుగుతాయని తితిదే వెల్లడించింది. ఈ మేరకు తితిదే ఈవో జవహర్ రెడ్డి వివరాలను వెల్లడించారు. స్వామివారి కల్యాణంలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొంటారని తెలిపారు. కొవిడ్ నిబంధనల మేరకు కల్యాణ వేదిక ఏర్పాటు ఉంటుందని చెప్పారు. కల్యాణోత్సవానికి పాసులుంటేనే అనుమతిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఐదు వేల మందికి కల్యాణోత్సవ పాసులు జారీ చేస్తామని వివరించారు.
ఈ నెల 21 నుంచి ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలు.. పాసులుంటేనే అనుమతి - ఏపీ తాజా వార్తలు
ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 21 నుంచి 29వ తేదీ దాకా జరుగుతాయని తితిదే వెల్లడించింది. కల్యాణోత్సవానికి పాసులుంటేనే అనుమతి ఉంటుందని తితిదే ఈవో జవహర్ రెడ్డి స్పష్టం చేశారు.
vontimitta brahmotsavalu 2021