ప్రభుత్వ పథకాలను నేరుగా ప్రజలకు చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్రామ, వార్డు వాలంటీర్ల నియామకంలో మిగిలిన పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంకా 9,674 గ్రామ వాలంటీర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీ కోసంపంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1 లక్షా 83 వేల మంది గ్రామ, వార్డు వాలంటీర్లు సేవలందిస్తున్నారు. 1 లక్షా 92 వేల 964 పోస్టులకు గానూ 9 వేల 674 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నవంబరు 1వ తేదీ నుంచి ఈ పోస్టులను భర్తీ చేయాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.
నవంబర్ 1 నుంచి గ్రామ, వార్డు వాలంటీర్ల నియామకాలు - volunteers vacancies recruitment latest news
మిగిలిన గ్రామ, వార్డు వాలంటీర్ల పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 9 వేల 674 పోస్టులను భర్తీ చేయాల్సి ఉందని.. త్వరితగతిన ఈ ప్రక్రియ పూర్తి చేయాలంటూ కలెక్టర్లకు పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. నవంబరు 1 నుంచి వాలంటీర్ల భర్తీ ప్రక్రియ మొదలు కానుంది.
volunteers-vacancies-recruitment-in-ap