రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం కవాడిపల్లిలో కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రోజు రోజుకు కొవిడ్ బాధితుల సంఖ్య పెరగడం వల్ల గ్రామంలో 10రోజుల పాటు స్వచ్ఛందంగా లాక్‌డౌన్ ప్రకటించారు.
ఆ గ్రామంలో స్వచ్ఛంద లాక్‌డౌన్
తెలంగాణ రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం కవాడిపల్లిలో 10 రోజుల పాటు స్వచ్ఛంద లాక్‌డౌన్ విధించారు. గత 20 రోజుల్లో నలుగురు... కరోనా బారిన పడి మృత్యువాత పడటంతో స్వచ్ఛంద లాక్‌డౌన్ విధించేందుకు గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆమోదం తెలిపింది.
గ్రామంలో 20రోజుల వ్యవధిలో... నలుగురు కొవిడ్‌తో మృతి చెందారు. వారిలో ఇద్దరు తల్లీ కుమారుడు ఉన్నారు. మరణాల సంఖ్య పెరగడం వల్ల గ్రామంలో స్వచ్ఛందంగా లాక్‌డౌన్ విధించేందుకు పంచాయతీ పాలకవర్గం నిర్ణయించింది. దీనితో ఈరోజు నుంచి 10 రోజుల పాటు గ్రామంలో స్వచ్ఛంద లాక్‌డౌన్ పాటించనున్నారు. గ్రామంలో నిత్యావసరాల కోసం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు సడలింపు ఇచ్చారు. ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని పాలకవర్గం సూచించింది.
ఇదీ చదవండి:Corona cases: కొత్తగా 1,433 కరోనా కేసులు, 15 మరణాలు