ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు: రాష్ట్ర ఎన్నికల సంఘం - local body elections in ap news
14:49 November 17
ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సిద్ధమని ఎస్‌ఈసీ స్పష్టం చేసింది. పంచాయతీ ఎన్నికలకు న్యాయపరమైన ఇబ్బందులు లేవని ఎస్ఈసీ పేర్కొంది. పంచాయతీ ఎన్నికలు పార్టీలకతీతంగా జరిగే ఎన్నికలన్న ఎస్‌ఈసీ... రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి తగ్గిందని స్పష్టం చేసింది. తెలంగాణలోనూ జీహెచ్‍ఎంసీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైందని పేర్కొంది. ఎన్నికల నిర్వహణ రాజ్యాంగపరమైన అవసరమని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ స్పష్టం చేశారు. కేంద్ర ఆర్థికసంఘం నిధులు తీసుకునేందుకూ ఎన్నికలు అవసరమన్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో లేదని స్పష్టం చేశారు. నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని చెప్పారు.
కొవిడ్ కారణంగా ఏపీలో వాయిదా పడిన స్థానిక ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ కీలక ప్రకటన విడుదల చేశారు. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఆలోచన చేస్తున్నట్లు స్పష్టం చేశారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకున్నామని గుర్తుచేశారు. రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కూడా తగ్గుముఖం పట్టిందని.. రోజుకు నమోదయ్యే కేసుల సంఖ్య 10వేల నుంచి 753కి తగ్గిందన్నారు. పార్టీలకు అతీతంగా జరిగే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు న్యాయపరమైన ఇబ్బందులు లేనందున వాటిని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
తెలంగాణలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలైందని ఎస్‌ఈసీ ప్రస్తావించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో లేదని.. పోలింగ్‌కు నాలుగు వారాల ముందు కోడ్ అమల్లోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికలపై ప్రభుత్వం, రాజకీయ పార్టీలు, అధికారులు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఈ ఎన్నికలు.. రాజ్యాంగపరమైన అవసరమే కాకుండా కేంద్ర ఆర్థిక సంఘం నిధులు తీసుకునేందుకూ దోహదపడతాయని చెప్పారు. కరోనా పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఆరోగ్యశాఖతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ పేర్కొన్నారు.
ఇదీ చదవండీ... వైఎస్ఆర్ సున్నావడ్డీ పథకం నిధులు విడుదల.. రైతుల ఖాతాల్లో 510 కోట్లు