రాష్ట్రంలో కొత్తగా 5,145 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా మరో 31 మంది మరణించినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ వైరస్ కేసులు 7,44,864కు చేరుకున్నాయి. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరకు 6,159 మంది మృతి చెందినట్లు తెలిపారు.
రాష్ట్రంలో కొత్తగా 5,145 కరోనా కేసులు, 31 మరణాలు
18:48 October 09
రాష్ట్రంలో కొత్తగా 5,145 కరోనా కేసులు, 31 మరణాలు
47,665 యాక్టివ్ కేసులు..
ప్రస్తుతం 47,665 యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటివరకు 6,84,930 మంది బాధితులు వైరస్ బారి నుంచి కోలుకున్నారు. 24 గంటల వ్యవధిలో 66,944 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు 63,49,953 మందికి కొవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : పేదల ఆకలి తీర్చే 'డబ్ల్యూఎఫ్పీ'కి నోబెల్ శాంతి బహుమతి