భారతమాత విగ్రహం తొలగించడం ఈ ప్రభుత్వం దుస్సాహసాలకు నిదర్శనం - bjp leaders protest cm home
![భారతమాత విగ్రహం తొలగించడం ఈ ప్రభుత్వం దుస్సాహసాలకు నిదర్శనం సోము వీర్రాజు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12864230-745-12864230-1629808980692.jpg)
17:38 August 24
VJA_BJP Agitaion on Bharathamatha Statue_Breaking
తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసం వద్ద భాజపా కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. డెల్టా కాల్వకట్ట విస్తరణలో భాగంగా తొలగించిన భారతమాత విగ్రహం పునఃప్రతిష్టించాలని వారు డిమాండ్ చేశారు. కూల్చటంతోనే పరిపాలన ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్, రెండు సంవత్సరాల పాలనలో ఒక్క నిర్మాణాన్ని కూడా చేపట్టలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు విమర్శించారు. 75 సంవత్సరాల ఆజాదీ కా అమృత్ మహెత్సవ్ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్న ప్రస్తుత తరుణంలో ఏకంగా భారత మాత విగ్రహాన్ని తొలగించడం ఈ ప్రభుత్వం దుస్సాహసాలకు నిదర్శనమన్నారు.
ఇలాంటి చర్యలను భాజపా ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదన్న సోమువీర్రాజు...ఎటువంటి ఇబ్బందులు సృష్టించనటువంటి ప్రదేశంలో ఉన్న భారతమాత విగ్రహాన్ని తిరిగి అదే స్థలంలో యథాస్థితిలో ఉంచాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా తొలగించిన అధికారులు భారతమాతను క్షమించమని వేడుకోవాలన్నారు.
ఇదీ చదవండి:AP Corona Cases: రాష్ట్రంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు