రాష్ట్ర ప్రభుత్వం పదోతరగతి పరీక్షలను వాయిదా వేసింది. ఈ పరీక్షలు నిర్ణయించే తేదీని ప్రకటించలేదు. జులైలో సమీక్ష నిర్వహించి పరీక్షలు తేదీని నిర్ణయించే అవకాశం ఉంది. వచ్చే జూన్ 7 నుంచి 16 వ తేదీ వారకు ఆంధ్రప్రదేశ్లో పదో తరగత పరీక్షలు నిర్వహించాలని ముందుగా ప్రభుత్వం నిర్ణయించింది. తేదీలను వాయిదా వేసే ప్రసక్తి లేదని పరీక్షలు యదాతదంగా జరుగుతాయని ప్రభుత్వం చెబుతూ వచ్చింది. దాదాపు 6 లక్షల మంది విద్యార్థులు 2021 వ విద్యా సంవత్సరానికి పదో తరగతి పరీక్షలకు హాజరుకావల్సి ఉంది.
10th class exams: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు వాయిదా! - ఏపీ పదో తరగతి పరీక్షలు వాయిదా
ap tenth exams postponed
12:05 May 27
నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం
వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఈ పరీక్షలను వాయిదా వేయాలంటూ ప్రభుత్వానికి వివిధ సందర్భాల్లో డిమాండ్ చేశారు. రెండోసారి కరోనా వ్యాప్తిలో కేసులు, మరణాల సంఖ్య పెరగటంతో విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు... ఏపీలో కరోనా ఉద్ధృతి కారణంగా కర్ఫ్యూ కొనసాగుతోంది. పరిస్థితుల తీవ్రతను గమనంలోకి తీసుకున్న ప్రభుత్వం... తాజాగా పరీక్షల వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇదీ చదవండి:
Last Updated : May 27, 2021, 12:38 PM IST