ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

VIVEKA MURDER: వివేకా హత్య కేసు: విచారణకు ఇద్దరు డ్రైవర్లు

వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, మాజీ డ్రైవర్ దస్తగిరి విచారణకు హాజరయ్యారు.

vivekanda reddy murder
వివేకాహత్యకేసు

By

Published : Jul 16, 2021, 4:00 PM IST

మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో అనుమానితులను విచారిస్తున్నారు. ఇవాళ పులివెందులకు చెందిన నలుగురు అనుమానితులు సీబీఐ విచారణకు హాజరయ్యారు.

వివేకా ప్రధాన అనుచరుడు ఎర్రగంగిరెడ్డి, మాజీ డ్రైవర్ దస్తగిరి విచారణకు హాజరయ్యారు. 20 రోజుల నుంచి వరుసగా వీరిద్దరినీ సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. వీరితోపాటు పులివెందులకు చెందిన ఇద్దరు వాహనాల డ్రైవర్లను ప్రశ్నిస్తున్నారు. రామ్మోహన్, బాబయ్య అనే ఇద్దరు డ్రైవర్లను విచారణకు పిలిచారు.

రెండేళ్ల కిందట వివేకా హత్య జరిగిన ముందు రోజు రాత్రి వివేకా ఇంటి పరిసరాల్లో కొన్ని వాహనాలు తిరిగినట్లు సీబీఐ ప్రాథమికంగా గుర్తించింది. రవాణశాఖ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు ఇద్దరు ప్రైవేటు వాహనాల డ్రైవర్లను కడపకు పిలిపించి విచారిస్తున్నారు.

ఇదీ చదవండి:Viveka murder case: వివేకా హత్య కేసు విచారణ.. ఐదుగురిని ప్రశ్నించిన సీబీఐ

ABOUT THE AUTHOR

...view details