ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Vivekaa PA Complaint to Kadapa SP: సునీత నుంచి నాకు ప్రాణహాని ఉంది.. ఎస్పీకి వివేకా పీఏ ఫిర్యాదు - ఏపీ తాజా వార్తలు

Vivekaa PA Complaint to Kadapa SP: తనకు ప్రాణహాని ఉందంటూ.. వివేకా పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుకు సంబంధించిన వివరాలను ఈ మేరకు ఎస్పీ అన్బురాజన్ వెల్లడించారు.

Vivekaa PA Complaint to Kadapa SP
ఎస్పీకి వివేకా పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు

By

Published : Dec 13, 2021, 7:22 PM IST

Updated : Dec 13, 2021, 10:46 PM IST

Vivekaa PA Complaint to Kadapa SP: వివేకా కుమార్తె సునీత, భర్త రాజశేఖర్ రెడ్డి, శివప్రకాష్ రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని వివేకా పీఏ కృష్ణారెడ్డి కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్​కు ఫిర్యాదు చేశారు. కొంతకాలంగా వివేకా హత్యకేసులో సీబీఐకి సాక్ష్యం చెప్పాలంటూ తనపై ఒత్తిడి తెస్తున్నారని కృష్ణారెడ్డి లేఖలో పేర్కొన్నారు. ఎస్పీని కలిసిన తర్వాత కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాకుండానే వెళ్లిపోయారు.

చర్యలు తీసుకుంటాం - ఎస్పీ అన్బురాజన్
SP Anburajan On Vivekaa PA Complaint: వివేకా పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదుకు సంబంధించిన వివరాలను ఎస్పీ అన్బురాజన్ వెల్లడించారు. కృష్ణారెడ్డి ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదు చేశారని వెల్లడించారు. ఆయన వివేకా ఇంట్లో 30 ఏళ్లుగా పని చేస్తున్నారని.. హత్య కేసులో కృష్ణారెడ్డి అనుమానితుడిగా ఉన్నాడని పేర్కొన్నారు. కృష్ణారెడ్డి ఫిర్యాదుపై అన్ని కోణాల్లో విచారించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

'వివేకా పీఏ కృష్ణారెడ్డి నాకు ఫిర్యాదు చేశారు. వివేకా ఇంట్లో 30 ఏళ్లుగా కృష్ణారెడ్డి పనిచేస్తున్నారు. హత్య కేసులో కృష్ణారెడ్డి అనుమానితుడుగా ఉన్నాడు. తనకు ప్రాణహాని ఉందని కృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుపై అన్ని కోణాల్లో విచారించి చర్యలు తీసుకుంటాం'- అన్బురాజన్, కడప జిల్లా ఎస్పీ

ఇదీ చదవండి:

TDP President Chandrababu : 'ప్రజాక్షేత్రంలో మీ తప్పులకు శిక్ష తప్పదు'

Last Updated : Dec 13, 2021, 10:46 PM IST

ABOUT THE AUTHOR

...view details