జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైకాపా నేతలు చేస్తున్న వ్యక్తిగత విమర్శలను ఖండిస్తున్నట్లు భాజపా నేత విష్ణుకుమార్ రాజు(bjp leader vishnu kumar raja fire on ycp) అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని పవన్ కల్యాణ్ ప్రశ్నిస్తే.. వైకాపా పేయిడ్ బ్యాచ్‌లు విమర్శలు చేస్తున్నాయని విష్ణు కుమార్ రాజు అన్నారు. పవన్ కళ్యాణ్‌పై వ్యక్తిగత విమర్శలు చేయడం దారుణం అన్నారు. పోసానికి మాట్లాడే నైతిక హక్కులేదన్నారు. ఈ మేరకు విశాఖలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వైకాపా నేతలు.. రాష్ట్ర రాజకీయాలను నీచ స్థితికి తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు.
పవన్ చెప్పినట్లు అన్ని పార్టీలు.. ప్రభుత్వంపై పోరాడాలి: విష్ణుకుమార్ రాజు - ఆంధ్రప్రదేశ్ న్యూస్ అప్డేట్స్
జనసేనాని పవన్‌పై వ్యక్తిగత విమర్శలను భాజపా నేత విష్ణుకుమార్ రాజు(bjp leader vishnu kumar raja fire on ycp) ఖండించారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని పవన్ ప్రశ్నిస్తే.. వైకాపా పేయిడ్ బ్యాచ్ విమర్శలు చేస్తున్నాయని మండిపట్టారు.
ముఖ్యమంత్రి జగన్ చెబితే ఢిల్లీ కోటలు బీటలు తీస్తామని వైకాపా ఎమ్మెల్యే జోగి రమేశ్ అంటున్నారు.. ఢిల్లీ కోట తలచుకుంటే మీరు ఏమౌతారో చూసుకోండని హెచ్చరించారు. దమ్ముంటే వైకాపా ఎంపీలు.. కోడి కత్తి, వివేకా హత్య కేసుల దర్యాప్తుపై హోంమంత్రి అమిత్ శాను అడగాలన్నారు. రాష్ట్రానికి అప్పులు ఇస్తున్న బ్యాంకర్ల వ్యవహార శైలిపై అనుమానం ఉందన్నారు. రాష్ట్ర మంత్రి వర్గం మారితే సీఎం కూడా మారాలన్నారు. ఈ దుర్మార్గపు పాలన నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడటానికి అన్ని పార్టీలు కలసి కట్టుగా పని చేయాలని విష్ణు కుమార్ రాజ(bjp leader vishnu kumar raja) కోరారు.
ఇదీ చదవండి: Bhabanipur bypoll: కొనసాగుతున్న దీదీ హవా.. ప్రియాంకపై 39వేల ఓట్ల ఆధిక్యం