బంగ్లాదేశ్ దేశ సముద్రజలాల్లోకి ప్రవేశించి.. ఆ దేశంలో బంధీలుగా ఉన్న రాష్ట్రానికి చెందిన 8 మంది మత్స్యకారులు విడుదలయ్యారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని పూసపాటిరేగ మండలం తిప్పలవలస గ్రామానికి చెందిన 8 మంది మత్స్యకారులు.... కొంత కాలంగా విశాఖపట్నంలో స్థిరపడ్డారు. విశాఖ పట్నం నుంచి సముద్రంలోకి చేపల వేటకు వెళ్లి జీవనం సాగించేవారు. సెప్టెంబర్ 27న బోటులో చేపల వేటకు వెళ్లిన వీరు పొరపాటున బంగ్లాదేశ్ భూభాగంలోకి ప్రవేశించారు. బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ అక్టోబర్2న వీరందరినీ పట్టుకుంది. అక్రమంగా చొరబడ్డారని కేసులు నమోదు చేసి ఆ దేశ జైళ్లలో బంధించారు. వీరిని విడిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు లేఖల ద్వారా కేంద్రాన్ని కోరింది. ఉపాధి కోసం వెళ్లిన జాలర్లను విడిచిపెట్టాలని విదేశాంగశాఖ పలుమార్లు చేసిన వినతి మేరకు బంగ్లాదేశ్ ప్రభుత్వం జాలర్లను నేడు విడుదల చేసింది. తమ వారు స్వదేశానికి బయలుదేరారన్న సమాచారంతో బంధువుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
బంగ్లాదేశ్ చెర నుంచి విశాఖ మత్స్యకారుల విడుదల - బంగ్లాదేశ్ చెర నుంచి మత్స్యకారుల విడుదల వార్తలు
బంగ్లాదేశ్లో బందీలుగా ఉన్న రాష్ట్రానికి చెందిన 8 మంది మత్స్యకారులు విడుదలయ్యారు. సెప్టెంబర్ 27న బోటులో చేపల వేటకు వెళ్లిన వీరు..పొరపాటున బంగ్లాదేశ్ భూభాగంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే.
vishakha-fishermen-released-from-bangladesh-captivity