ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

భౌతికదూరం మరిచారో... ఇట్టే చెప్పేస్తోంది....! - corona virus

కొవిడ్... కొత్త అవసరాలను తెచ్చి పెట్టింది. జీవన శైలిలో అనేక మార్పులను తీసుకువచ్చింది. కొవిడ్ ప్రమాణాలుగా చెప్పే కొన్నింటిని ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాల్సిందే. ఈ ఆలోచనతోనే ఓ యువ స్టార్టప్ బృందం సరికొత్త పంథాలో ముందుకు వస్తోంది. మహమ్మారిపై పోరులో పరిజ్ఞానానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తించి... టెక్ బాటలో నూతన ఆవిష్కరణలు చేస్తోంది.

FDsocial distance monitor
social distance monitor

By

Published : Jul 28, 2020, 12:15 AM IST

విశాఖకు చెందిన ఓ యువ బృందం...కొవిడ్ సవాళ్లను అధిగమించే దిశగా టెక్ పరిష్కారంతో మార్కెట్ లోకి వచ్చింది. ఈ ఏడాది తొలిమాసంలో సూపర్ వ్యూ అనే సాఫ్ట్ వేర్ కంపెనీని యువకులు విశాఖలో నెలకొల్పారు. బృంద స్ఫూర్తితో విజయవంతంగా నడపాలని భావిస్తున్న తొలిరోజుల్లోనే కొవిడ్ మహమ్మారి వారి కలలకు అడ్డుపడింది. టెక్నాలజీపై ఆ యువకులకు ఉన్న పట్టు... కొవిడ్ కు అడ్డుకట్ట వేసే దిశగా ఆలోచనలకు అవకాశాన్ని కల్పించింది. అప్పటి వరకు చేస్తున్న ప్రాజెక్టులకు మార్పులు చేసి ప్రస్తుత దశలో ఎంతో కీలకంగా ఉన్న భౌతిక దూరం అంశంపై దృష్టి సారించారు. ఇందుకోసం సోషల్ డిస్టెన్స్ మోనిటర్​గా పిలిచే సాంకేతిక పరిజ్ఞానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు.

ఇలా పనిచేస్తుంది....

సోషల్ డిస్టెన్స్ మోనిటర్ గా పిలిచే ఈ పరిజ్ఞానాన్ని ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం సహా మ్యాన్ కైండ్ ఫార్మా సంస్థ సైతం వినియోగానికి తీసుకుంది. సీసీ కెమెరాల ఆధారంగా పని చేస్తూ... నిర్దేశించిన దూరం కంటే ఏ ఇద్దరు దగ్గరగా కదిలినా వెంటనే గుర్తించడం ఈ పరిజ్ఞానం ప్రత్యేకత. తిరుమలలో అమలు చేసిన విధానంలో ఓ మార్పును చేశారు. కేవలం గమనిస్తూ ఉండడం కాకుండా అప్రమత్తం చేసే విధానాన్ని అక్కడ ప్రవేశ పెట్టారు. భౌతిక దూరాన్ని ఏ ఇద్దరు పాటించకపోయినా వెంటనే ఓ గంట మోగిన శబ్దం అక్కడ వస్తుంది.. వెంటనే వారు అప్రమత్తమై దూరంగా జరగడానికి అవకాశం కల్పిస్తోంది. బృందం సహకారంతోనే కొవిడ్ వ్యాప్తి నివారణ దిశగా ప్రాజెక్టులపై పని చేస్తున్నామని సూపర్ వ్యూ సీఈఓ రాజా కొణతాల చెబుతున్నారు.

మాస్క్ ధరించినా గుర్తుపట్టేస్తోంది...

భౌతికదూరంతో పాటు కొవిడ్ వ్యాప్తికి అవకాశం కల్పిస్తున్న ఇతర అంశాలపైనా సూపర్ వ్యూ పని చేస్తోంది. ముఖ్యంగా కార్యాలయాలు తెరుచుకున్నందున అక్కడ ప్రధానంగా ఎదురయ్యే అటెండెన్స్ సమస్యకు టచ్ లెస్ పరిష్కారాన్ని తీసుకువచ్చింది. కార్యాలయం ప్రధాన ద్వారంలో ఉంచే సీసీ కెమెరా ద్వారా లోపలికి ప్రవేశించే వ్యక్తి హాజరును నమోదు చేసుకునే సౌకర్యం సూపర్ వ్యూ సంస్థ కల్పిస్తోంది. మాస్కు ధరించి ఉన్న వ్యక్తి ముఖాన్ని సైతం గుర్తు పట్టగలగడం కూడా ఓ ప్రత్యేకత. మరోవైపు ఉద్యోగి ఫొటో ఒక్కసారి అప్డేట్ చేస్తే ఏవైపుగా అతను తిరిగి ఉన్నప్పటికీ సీసీ కెమెరా ద్వారా గుర్తు పట్టి హాజరును నమోదు చేసే పరిజ్ఞానం తాము అందిస్తున్నామని చెబుతున్నారు.

తాము అభివృద్ధి చేసే పరిజ్ఞానం ఓ వైపు మెరుగైన ఫలితాలను అందించడంతో పాటు ప్రజల్లోనూ అవగాహన కల్పించే దిశగా ఉండాలనేది ప్రస్తుత లక్ష్యంగా చెబుతున్నారు సంస్థ ప్రతినిధులు. ఇప్పటి వరకు సాఫ్ట్ వేర్ పై పని చేసిన ఈ యువ బృందం హార్డ్ వేర్ పై దృష్టిసారించింది. ఆ దిశగా సీసీ కెమెరాలు సహా ఇతర పరికరాలను తయారు చేయాలని భావిస్తోంది. సీసీ కెమెరాల కోసం ఎక్కువగా దిగుమతులపై ఆధారపడుతున్న వేళ... దేశీయంగా వీటిని తయారు చేయించే దిశగా కసరత్తు ఈ యువకులు కసరత్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

మెుదటి రాత్రే అనారోగ్యమన్నాడు.. తర్వాత ఇలా చెప్పాడు..!

ABOUT THE AUTHOR

...view details