సీఎం సహాయ నిధికి దాతల చేయూత - ఏపీ సీఎం సహాయనిధి వార్తలు
కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా సహాయక చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి విశాఖ పోర్ట్ ట్రస్టు రూ.75 లక్షలు, ఏపీ ప్రైవేటు అన్‌ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాల సంఘం రూ.50 లక్షలు విరాళంగా ఇచ్చాయి.
కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా సహాయక చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి విశాఖ పోర్ట్ ట్రస్టు రూ.75 లక్షలు, ఏపీ ప్రైవేటు అన్‌ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాల సంఘం రూ.50 లక్షలు విరాళంగా ఇచ్చాయి. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి విశాఖ పోర్ట్ ట్రస్టు ఛైర్మన్ కె.రామమోహన్‌రావు విరాళం చెక్కును అందజేశారు. పాఠశాలల యాజమాన్యాల తరఫున ఆ సంఘం అధ్యక్షుడు ఎంవీ రామచంద్రారెడ్డి, ప్రతినిధులు తులసి విష్ణు ప్రసాద్, ఎంవీ రావు, ఎంఎస్‌ఎన్ రెడ్డి, విజయ్ చెక్కును ముఖ్యమంత్రికి ఇచ్చారు. వీరితో పాటు హోంమంత్రి సుచరిత కూడా ఉన్నారు.