పార్వతీపురం మన్యం జిల్లాలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. పీడితులు ఆసుపత్రులకు వరుస కడుతున్నారు. గుమ్మలక్ష్మీపురం మండలం భద్రగరి సామాజిక ఆసుపత్రికి రోజుకు 200 మంది వరకు ఓపీకి వస్తుండగా 50 నుంచి 60 మంది ఇన్ పేషెంట్లుగా చేరుతున్నారు. ఈ ఆసుపత్రి స్థాయిని 50 పడకలకు పెంచినా ప్రస్తుతం 25 మాత్రమే అందుబాటులో ఉండటంతో ఒక్కో మంచంపై ముగ్గురు, నలుగురు చొప్పున ఉండాల్సిన పరిస్థితి. నూతన భవనం పనులు ప్రారంభించినా పునాది స్థాయిలోనే ఉండటంతో గదులు సరిపోక వరండాలో మంచాలు వేశారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లామని, త్వరలో సౌకర్యాలు మెరుగు పడతాయని వైద్యాధికారి రవికుమార్ తెలిపారు.
మన్యం జిల్లాలో విష జ్వరాలు - విష జ్వరాలు
పార్వతీపురం మన్యం జిల్లాలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. బాధితులు భారీ సంఖ్యలో ఆసుపత్రులకు వస్తున్నారు. ప్రతీ రోజు 200 మందికి పైగా వస్తుండగా వారిలో 50 నుంచి 60 మంది ఇన్‌పేషంట్లుగా చేరుతున్నారు.
మన్యం జిల్లాలో విష జ్వరాలు