స్వామీ..!
నిన్ను పిలవాలనే కోరిక నిండుగా ఉంది.. కానీ భయం వెంటాడుతోంది.
కొలవాలని ఆశ మెండుగా ఉంది.. కానీ నిలవలేని దుస్థితి నెలకొంది.
స్వామీ..!
కోటి దీపాలు వెలిగించాలని ఉంది.. కానీ చీకటి కమ్ముకుంది.
పండ్లు ఫలహారాలు ఇవ్వాలని ఉంది.. కానీ ఆకలి కన్నీరు పెట్టిస్తోంది.
స్వామీ..!