PROBATION: త్వరలో ప్రొబేషన్ ఖరారై, తమ ఉద్యోగాలు శాశ్వతం అవుతాయని ఆనందంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ఓటీఎస్ బకాయిలు గుది బండగా మారనున్నాయి. ఇళ్ల క్రమబద్ధీకరణకు ప్రజల నుంచి వసూలు చేసిన రూ.82.46 కోట్లకు వెంటనే లెక్కలు తేల్చాలని కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఆదేశించారు. సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ను ఖరారు చేసే ముందు వీటిని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. గత ప్రభుత్వాలు పేదల కోసం నిర్మించిన ఇళ్ల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఓటీఎస్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. పేదల నుంచి నిర్దేశిత రుసుములు వసూలు చేసి, వారి పేర్లతో ఇంటికి రిజిస్ట్రేషన్ చేయించే బాధ్యతను గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు అప్పగించారు. ఈమేరకు వారికి లక్ష్యాలను నిర్దేశించిన ఉన్నతాధికారులు గట్టిగా ఒత్తిడి చేశారు. అతి త్వరలో సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ ఖరారు చేస్తున్న దశలో ఈనెల 16న ఆయా శాఖల ఉన్నతాధికారులు, కలెక్టర్లతో సీఎస్ నిర్వహించిన వెబ్ కాన్ఫరెన్స్‌లో ఓటీఎస్ నిధుల అంశం ప్రస్తావనకొచ్చింది. డిపార్ట్‌మెంట్‌కు ఇంకా రూ.82.46 కోట్లు రావలసి ఉందని అధికారులు వెల్లడించారు. చలానా జనరేట్ చేసి డిపాజిట్ చేయనివి, అసలు చలానాయే జనరేట్ చేయనివి ఇందులో ఉన్నట్లు పేర్కొన్నారు. జిల్లాల వారీగా సమాచారం పంపుతున్నామని, వేగంగా లెక్కలు తేల్చాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. లెక్కలు చెప్పని ఉద్యోగుల ప్రొబేషన్ ప్రక్రియను నిలిపి వేయాలని ఆయన సూచించారు. ఈ ఆదేశాలతో ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
PROBATION: ప్రొబేషన్‌కు ఓటీఎస్‌తో లింకు?.. ఆందోళనలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు - అమరావతి తాజా వార్తలు
PROBATION: త్వరలో ప్రొబేషన్ ఖరారై, తమ ఉద్యోగాలు శాశ్వతం అవుతాయని ఆనందంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ఓటీఎస్ బకాయిలు గుది బండగా మారనున్నాయి. ఇళ్ల క్రమబద్ధీకరణకు ప్రజల నుంచి వసూలు చేసిన రూ.82.46 కోట్లకు వెంటనే లెక్కలు తేల్చాలని కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఆదేశించారు. సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ను ఖరారు చేసే ముందు వీటిని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.
ప్రొబేషన్‌కు ఓటీఎస్‌తో లింకు