గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌ను కలిశారు. సచివాలయ ఉద్యోగుల సంఘం ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో సీఎస్‌తో భేటీ అయ్యారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ అనంతర పరీక్షలపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రొబేషన్ డిక్లరేషన్ పరీక్షలపై ప్రభుత్వ ప్రకటనతో గందరగోళం ఉందని వెంకట్రామిరెడ్డి అన్నారు. రెండు రకాల పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం ప్రకటించిందని.. ఒక పరీక్షే నిర్వహించాలని సీఎస్‌ను కోరామని తెలిపారు. డిపార్ట్‌మెంటల్ పరీక్ష నుంచి మినహాయింపు కోరినట్లు వెంకట్రామిరెడ్డి వెల్లడించారు.
ప్రొబేషన్ డిక్లరేషన్ పరీక్షలపై ప్రభుత్వ ప్రకటనతో గందరగోళం: వెంకట్రామిరెడ్డి - ward , schivalya employees difficulties
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ పరీక్షలపై ప్రభుత్వ ప్రకటనతో గందరగోళం ఉందని సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. రెండు రకాల పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం ప్రకటించిందని.. ఒక పరీక్షే నిర్వహించాలని సీఎస్‌ను కోరినట్లు తెలిపారు. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌ను కలిశారు.
venkat rami reddy
పరీక్షా విధానాన్ని సరళతరం చేసినట్టుగా సీఎస్ అన్నారని వెంకట్రామిరెడ్డి తెలిపారు. తొలి పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయినా రెండోమారు రాసే పరీక్ష వల్ల సీనియారిటికీ ఇబ్బంది రాదని ప్రభుత్వం తెలియచేసిందన్నారు. ఏపీపీఎస్సీ నిర్వహించే డిపార్ట్మెంటల్ పరీక్ష నుంచి మినహాయించాలని కోరామని తెలిపారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ప్రొబేషన్ పూర్తి కావడానికి డిపార్ట్మెంట్ పరీక్షలు రాయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:
ap inter results 2021: ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల..
Last Updated : Jul 23, 2021, 7:48 PM IST