బ్లాక్‌ఫంగస్‌తో తెలంగాణలోని వికారాబాద్ జిల్లా తాండూరు మండలం ఎల్మకన్నె వాసి మృతి చెందారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వెంకట్‌రెడ్డి(46) కన్నమూశారు. ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న వెంకట్‌రెడ్డి.. కంటికి ఇన్‌ఫెక్షన్ కావడంతో అస్వస్థతకు గురయ్యారు.
వెంకట్‌రెడ్డికి బ్లాక్‌ఫంగస్ సోకినట్లు జిల్లా ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. చికిత్స నిమిత్తం మహబూబ్‌నగర్ ఆస్పత్రికి తరలించారు. నిన్న రాత్రి పరిస్థితి విషమించడంతో గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ వెంకట్‌రెడ్డి మృతి చెందారు.