మనకు ఏ మాత్రం తెలియకుండానే.. మన పేరు మీద ఎన్ని ఫోన్ నంబర్లున్నాయన్నది తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించిన వెబ్‌సైట్‌ను విజయవాడ టెలికాం విభాగం(డీవోటీ) రూపొందించి సోమవారం ప్రారంభించింది.
http://tafcop.dgtelecom.gov.in అనే వెబ్‌సైట్‌లో మొబైల్ నంబరు.. దానికి వచ్చే ఓటీపీ నమోదు చేయగానే మన పేరుమీద ఉన్న ఫోన్ నంబర్ల వివరాలన్నీ వస్తాయి. వాటిలో మనకు అవసరం లేనివి, మనకు తెలియకుండా మన పేరుమీద ఉన్న వాటిని సెలక్ట్ చేసి సబ్మిట్ చేస్తే.. టెలికం శాఖ చర్యలు తీసుకుంటుంది.