ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

యువ సంపన్నుల్లో మరోసారి మెరిసిన విజయవాడ వాసి - ఐఐఎఫ్ఎల్ 40 ఏళ్లలోపు యువ ధనవంతుల జాబితా

మంచి ఉద్యోగం చెయ్యాలని కొందరు కలలు కంటుంటే.. మరికొందరు అందుకు విరుద్ధంగా ఆలోచిస్తారు. సొంతగా వ్యాపార రంగంలో ఎదగాలని ఆశపడుతుంటారు. కృషి, పట్టుదలతో విజయాలు సాధించి సంపన్నుడిగా మారిన శ్రీహర్ష మాజేటి ఆ కోవకు చెందిన వారే. నాలుగు పదుల వయస్సులోపే రూ. 1,400 కోట్లు సంపాదించి.. పలువురు యువకులకు ప్రేరణగా నిలిచారు.

ఐఐఎఫ్ఎల్ నలభై ఏళ్ల లోపు ధనవంతుడు
ఐఐఎఫ్ఎల్ నలభై ఏళ్ల లోపు ధనవంతుడు

By

Published : Oct 14, 2020, 9:09 AM IST

'ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ హురున్‌ ఇండియా 40 - అండర్‌ సెల్ఫ్‌ మేడ్‌ రిచ్‌ లిస్ట్‌ 2020' జాబితాలో విజయవాడకు చెందిన శ్రీహర్ష మాజేటి రూ. 1,400 కోట్ల సంపదతో 15వ స్థానంలో నిలిచారు. ఆయన సంపద విలువ గతేడాది స్థాయిలోనే ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. వ్యాపార రంగంలో సొంతంగా ఎదిగి సంపన్నులుగా మారిన నలభై ఏళ్లలోపు యువకుల జాబితాను 'ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌- హురున్‌ ఇండియా' సంస్థ వెల్లడించింది. ఫుడ్ డెలివరీ యాప్ మాతృ సంస్థ బుందిల్ టెక్నాలజీస్ సహ-వ్యవస్థాపకుడే ఈయన.

మొదటి పది స్థానాలు పొందిన వ్యక్తులు
పేరు సంస్థ సంపద (రూ. కోట్లలో)

నితిన్ కామత్,

నిఖిల్ కామత్

జెరోధా 24,000 దివ్యాంక్ తురఖియా మీడియా.నెట్ 14,000 అమోద్ మాల్వీయ ఉడాన్ 13,100 సుజీత్ కుమార్ ఉడాన్ 13,100 వైభవ్ గుప్తా ఉడాన్ 13,100 రిజు రవీంద్రన్ థింక్ అండ్ లెర్న్ 7,800 బిన్నీ బన్సల్ ఫ్లిప్​కార్ట్ 7,500 సచిన్ బన్సల్ ఫ్లిప్​కార్ట్ 7,500 రితేష్ అగర్వాల్ అరవెల్ స్టేస్ 4,500 భవీష్ అగర్వాల్ ఏఎన్ఐ టెక్నాలజీస్ 3,500

జెరోధా స్టాక్‌బ్రోకింగ్‌ వ్యవస్థాపకులైన నితిన్‌ కామత్, నిఖిల్‌ కామత్‌కు ఈ జాబితాలో అగ్రస్థానం దక్కింది. మీడియా.నెట్​కు చెందిన దివ్యాంక్ తురఖియా రెండు, ఉడాన్​కు చెందిన ఆమోద్ మాల్వీయ మూడు స్థానాల్లో ఉన్నారు. ఫ్లిప్​కార్ట్, థింక్ అండ్ లెర్న్, ఏఎన్ఐ టెక్నాలజీస్, జొమాటో ఇండియా సంస్థల వ్యవస్థాపకులూ ఈ జాబితాలో ఉన్నారు. ఇందులో చోటు సంపాదించిన ఏకైక మహిళ.. వీయూ టెక్నాలజీస్ ప్రారంభించిన దేవితా సరాఫ్. రూ. 1,200 కోట్ల సంపదతో ఆమె 16వ స్థానంలో నిలిచారు.

ABOUT THE AUTHOR

...view details