ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాసరావు సెల్ఫీ వీడియోలో చేసిన వ్యాఖ్యలపై విజయవాడ సీపీ స్పందించారు. ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. పోలీసు జాగిలాలు సక్రమంగా పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు. జాగిలాలను నిత్యం పశువైద్యులు పరీక్షిస్తారని తెలిపారు. శ్రీనివాసరావును ఏప్రిల్‌లో డాగ్ స్క్వాడ్ నుంచి ఏఆర్‌కు బదిలీ చేశామని వెల్లడించారు. ప్రస్తుతం శ్రీనివాసరావు ఆరోగ్య సమస్యలతో సిక్ లీవ్‌లో ఉన్నాడని చెప్పారు. శ్రీనివాసరావు ఇప్పటివరకు వీఆర్ఎస్ కోరలేదని స్పష్టం చేశారు.
ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ ఆరోపణల్లో వాస్తవం లేదు: విజయవాడ సీపీ - విజయవాడ ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ తాజా వార్తలు
ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ ఆరోపణల్లో వాస్తవం లేదని విజయవాడ సీపీ శ్రీనివాస్ స్పష్టం చేశారు. జాగిలాలను నిత్యం పశువైద్యులు పరీక్షిస్తారని తెలిపారు. శ్రీనివాసరావు ఇప్పటివరకు వీఆర్ఎస్ కోరలేదని స్పష్టం చేశారు.
vijayawada cp srinivasulu