ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'విజయసాయిని రాజ్యసభ ఫ్లోర్ లీడర్ పదవి నుంచి తొలగించాలి'

రాజ్యసభ ఛైర్మన్ విషయంలో నిన్న జరిగిన ఘటన దురదృష్టకరమని... ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. గతంలో ఎస్​ఈసీపైనా విజయసాయి అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. షర్మిల పార్టీ పెట్టడం జగన్ డైరెక్షన్​లో జరిగిందా లేదా అనేది త్వరలో తేలుతుందని అభిప్రాయపడ్డారు.

By

Published : Feb 9, 2021, 6:06 PM IST

ఎంపీ రఘురామకృష్ణరాజు
ఎంపీ రఘురామకృష్ణరాజు

రాజ్యసభలో ఛైర్మన్ వెంకయ్యనాయుడుపై వైకాపా ఎంపీ విజయసాయి చేసిన వ్యాఖ్యల పట్ల ఎంపీ రఘురామకృష్ణరాజు ఘాటుగా స్పందించారు. మనిషికి ఉండే కనీస జ్ఞానం కొంత మందికి లేకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో తక్కువ, విశాఖలో ఎక్కువగా ఉండే విజయసాయిరెడ్డికి విశాఖలోనే మానసిక వైద్యం అందించాలని ఎద్దేవా చేశారు.

పరువు పోయింది...

విజయసాయిరెడ్డి వల్ల వైకాపా పరువు, సీఎం జగన్ పరువు దిల్లీలో పోయిందని రఘురామ వ్యాఖ్యానించారు. విజయసాయిరెడ్డిని రాజ్యసభ ఫ్లోర్ లీడర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. వ్యక్తిగత స్వేచ్ఛ హరిస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి కోర్టుకు వెళ్లడం హాస్యాస్పదమన్న రఘురామ... రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉండే వారిపై వ్యాఖ్యలు చేసే మంత్రులకు, ఎంపీలకు రాజ్యాంగం గురించి అవగాహన తరగతులు నిర్వహించాలని పేర్కొన్నారు.

సీరియస్​గా పోరాడమని చెప్పండి...

విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యపై పార్టీ ఎంపీలను సీరియస్​గా పోరాడాలని చెప్పండంటూ... ముఖ్యమంత్రి జగన్​ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. సీఎం అనుమతి లేకుండా విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కాదని పేర్కొన్నారు.

తెలంగాణలో ఓట్లు రావడం కష్టం..

జగన్, షర్మిల మధ్య.. అన్నాచెల్లెళ్లుగా మంచి అన్యోన్యత ఉందని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. షర్మిల పార్టీ పెట్టడం జగన్​ డైరెక్షన్​లో జరిగిందా లేదా అనేది త్వరలో తేలుతుందని వ్యాఖ్యానించారు. దివంగత వైఎస్సార్ తెలంగాణకు వ్యతిరేకం, సమైఖ్య ఆంధ్రప్రదేశ్​కు అనుకూలమని గుర్తు చేశారు. వైఎస్ పేరు లేకుండా షర్మిల లేదని... ఇలాంటి పార్టీకి తెలంగాణలో ఓట్లు రావడం కష్టమని జోస్యం చెప్పారు. తమిళనాడులోనో, కర్నాటకలోనో పార్టీ పెట్టి ఉంటే.. ఎక్కువ ఓట్లు వచ్చేవని సూచించారు.

ఇదీ చదవండి:

షర్మిల పార్టీతో వైకాపాకు ఎలాంటి సంబంధం లేదు: సజ్జల

ABOUT THE AUTHOR

...view details