కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ను చిన్నచూపు చూస్తోందని వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని కేంద్రం ఇప్పటికీ అమలు చేయలేదని గుర్తుచేశారు. రాజ్యసభ సమావేశాల్లో హోదా అంశాన్ని ప్రస్తావించిన ఆయన.. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను కేంద్రం ఆర్థికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వొద్దని ప్రణాళిక సంఘం ఎక్కడా చెప్పలేదన్నారు. ఈ విషయంలో ఎన్డీయే మంత్రులు, ఆ కూటమి ఎంపీలు ప్రజలను తప్పుదోవ పట్టించారని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైల్వే జోన్ కేటాయింపులోనూ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని.. విశాఖకు రైల్వే జోన్ ఇస్తానని చెప్పి కేంద్రం మాట తప్పిందన్నారు.
ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వండి: విజయసాయిరెడ్డి - రాజ్యసభలో విజయసాయిరెడ్డి
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వాలని.. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. ఇవాళ రాజ్యసభలో హోదా అంశాన్ని లేవనెత్తారు. విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు.
విజయసాయిరెడ్డి
TAGGED:
రాజ్యసభలో విజయసాయిరెడ్డి