ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కేంద్ర బడ్జెట్​లో ఏపీకి మొండిచేయి: ఎంపీ విజయసాయిరెడ్డి - central budjet to ap

కేంద్రం ఏపీపై పక్షపాత దోరణితో వ్యవహరించిందని ఎంపీ విజయసాయి రెడ్డి ఆరోపించారు. కేంద్ర బడ్జెట్​లో ఏపీకి మొండి చేయి చూపిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా కోసం ఎదురుచూశామని వెల్లడించారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని బడ్జెట్ సమావేశాల్లో ప్రస్తావిస్తామని తెలిపారు.

vijayasai reddy on central budjet
కేంద్ర బడ్జెట్​పై విజయసాయిరెడ్డి

By

Published : Feb 1, 2020, 4:12 PM IST

కేంద్ర బడ్జెట్​పై విజయసాయిరెడ్డి

కేంద్ర బడ్జెట్‌ రాష్ట్రానికి నిరాశే మిగిల్చిందని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక లోటును తగ్గించేందుకు ఆహార రాయితీ, రుణమాఫీలను తగ్గించడం వల్ల వ్యవసాయాధార రాష్ట్రమైన ఏపీపై భారం పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా కోసం ఎదురు చూసినా నిరాశే మిగిలిందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు త్వరితగతిన నిధులు విడుదల చేయాలని కోరారు. వెనుకబడిన 7 జిల్లాలకు రావాల్సిన రూ.24 వేల కోట్లు గురించి ప్రస్తావన లేదని నిరాశ వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం మొండిచేయి చూపిందని అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఏపీకి జరిగిన అన్యాయాన్ని బడ్జెట్ సమావేశాల్లో ప్రస్తావిస్తామని విజయసాయిరెడ్డి అన్నారు. ఏపీ ప్రయోజనాల కోసం పోరాడుతామని తెలిపారు. బడ్జెట్​లోని వివరాలన్నింటిని పరిశీలిచాల్సి ఉందన్నారు

ఇదీ చదవండి : ఆదాయ పన్ను రేట్లు తగ్గింపు- షరతులు వర్తిస్తాయ్!

ABOUT THE AUTHOR

...view details