ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

"పసుపు పచ్చ విప్లవం రావాల్సిన అవసరం ఉంది" - వెంకయ్య నాయుడు

దేశంలో పసుపు పచ్చ విప్లవం రావాల్సిన అవసరం చాలా ఉందని వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి నేతృత్వంలోని.. వాణిజ్య శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫార్సు చేసింది. ఇందుకు సంబంధించిన నివేదికను రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడికి అందించారు.

vijaya sai reddy
vijaya sai reddy

By

Published : Jun 16, 2022, 9:34 AM IST

వంట నూనెల కొరతను అధిగమించాలంటే.. దేశంలో పసుపు పచ్చ విప్లవం (ఎల్లో రివల్యూషన్‌) రావాల్సిన అవసరం ఉందని వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి నేతృత్వంలోని వాణిజ్య శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫార్సు చేసింది. జిల్లాలను ఎగుమతి కేంద్రాలుగా తీర్చిదిద్దే పథకం అమలుకు సంబంధించిన నివేదికలను ఆయన బుధవారం రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడికి సమర్పించారు.

వంట నూనెల ధరలు అసాధారణంగా పెరగడానికి ప్రధాన కారణం మన దేశం దిగుమతులపై అధికంగా ఆధారపడటమేనని, ఏడాది పొడవునా దాన్ని అందుబాటులో ఉంచాలంటే మనం స్వావలంబన సాధించాలని కమిటీ సూచించింది. దేశంలో పసుపు పచ్చ విప్లవం వస్తే.. దేశ అవసరాలకు సరిపడే విధంగా నూనె ఉత్పత్తి పెంచడానికి సమగ్ర చర్యలు తీసుకోవడానికి వీలవుతుందని పేర్కొంది. పామాయిల్‌, సోయాబీన్‌, పొద్దుతిరుగుడు, ఆవాల పంట సాగును విస్తరించి నూనె గింజల ఉత్పత్తిని పెంచాలని సూచించింది. వీటి ద్వారా ఎగుమతులకు అనువైన నూనెలను ఉత్పత్తి చేయొచ్చని, పామాయిల్‌ ఉత్పత్తిలో స్వావలంబన సాధించేలా కేంద్రం రాష్ట్రాలకు చేయూతను అందించాలని ఈ కమిటీ సిఫార్సు చేసింది.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details