ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వాల్తేరు డివిజన్ ఉండాలి.. రాజ్యసభలో విజయసాయిరెడ్డి - రాజ్యసభలో వాల్తేరు ప్రస్తావన

వాల్తేరు డివిజన్​ను విశాఖ జోన్​లో కొనసాగించాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. రాజ్యసభ జీరో అవర్​లో ఈ విషయాన్ని ప్రస్తావించారు.

వాల్తేరు డివిజన్ ఉండాలి.. రాజ్యసభలో విజయసాయిరెడ్డి

By

Published : Nov 20, 2019, 1:13 PM IST

వాల్తేరు డివిజన్​ను విశాఖ జోన్​లో కొనసాగించాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. రాజ్యసభ జీరో అవర్​లో ఈ విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఎంతోకాలంగా ఉత్తరాంధ్ర ప్రజలు ఎదురుచూస్తున్న విశాఖ రైల్వే జోన్‌ కలను సాకారం చేస్తూ.. కేంద్రం సాధారణ ఎన్నికలకు ముందే నిర్ణయం వెలువరించింది. రాష్ట్ర విభజన జరిగిన ఐదేళ్ల తర్వాత.. తూర్పు కోస్తా రైల్వే జోన్‌ను ప్రకటించిన కేంద్రం.. ప్రధాన కార్యాలయం విశాఖలో ఉంటుందని ఉత్తర్వులు ఇచ్చింది. సుదీర్ఘ చరిత్ర ఉన్న వాల్తేర్ డివిజన్‌ను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.

ABOUT THE AUTHOR

...view details