వైకాపాలో మరిన్ని చేరికలు.. పవన్‌ది యూటర్న్ పాలసీ! - జగన్
వైకాపాలోకి మరిన్ని చేరికలు ఉండబోతున్నాయని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. రాజధాని విషయంలో పవన్ వైఖరిని ఆయన తప్పుబట్టారు.

vijayasai_reddy_comments_on_pawan_kalyan
వైకాపాలోకి ఆసక్తికర చేరికలు ఉంటాయని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. రాజధాని విషయంలో అస్పష్టత ఏమీ లేదని స్పష్టం చేశారు. రాజధానిలో ఉన్న కష్టనష్టాలు సరిచేస్తామని హామీ ఇచ్చారు. పవన్ కల్యాణ్ ద్వంద్వ వైఖరితో ఉన్నారని విమర్శించారు. గతంలో అమరావతి రాజధానికి అనుకూలం కాదని... ఇప్పుడు పవన్ కల్యాణ్ యూ టర్న్ తీసుకున్నారని ధ్వజమెత్తారు.