ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అధిక ధరలు వసూలు చేస్తున్న ఆసుపత్రులు..అధికారుల దాడులు

కరోనా బాధితుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్న ఆసుపత్రులపై రాష్ట్రవ్యాప్తంగా ఫ్లైయింగ్​ స్క్వాడ్​ అధికారులు దాడులు నిర్వహించారు. రోగుల ఫిర్యాదు మేరకు కొన్ని ఆసుపత్రుల్లో అధిక ధరలు వసూలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించి అధిక ధరలు వసూలు చేస్తున్న ఆసుపత్రి యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

అధిక ధరలు
అధిక ధరలు

By

Published : Apr 28, 2021, 7:32 AM IST

అధిక ధరలు వసూలు చేస్తున్న ఆసుపత్రులపై అధికారుల దాడులు

ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధిక ధరలను కరోనా బాధితుల నుంచి వసూలు చేస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు రాష్ట్రవ్యాప్తంగా 25 ఆసుపత్రులలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆయా ఆసుపత్రులలో ఆక్సిజన్, రెమ్​డెసివర్​, ఇతర కరోనా మందుల నిల్వలు సరఫరాలను పరిశీలించారు. ఈ తనిఖీలలో నర్సరావుపేటలోని ఓ హాస్పిటల్​లో రోగుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేసినట్టు అధికారులు తెలిపారు. తిరుపతిలోని మరో ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ ఉన్నపటికీ రోగుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేసినట్టు అధికారులు గుర్తించారు.

విజయనగరం, ప్రకాశం, ఒంగోలులోని కొన్ని ఆసుపత్రుల్లో అవసరం కంటే ఎక్కువగా రోగుల పేరుతో రెమ్​డెసివర్​ ఇంజక్షన్లు ఇండెంట్ పెట్టి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించిన సదరు హాస్పిటళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు వివరించారు. రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల యాజమాన్యాలను ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కరోనా వ్యాధి చికిత్సలు అందించవలసినదిగా కోరారు. ఆసుపత్రుల్లో అధిక ధరల నియంత్రణ కోసం జిల్లా స్థాయిలో వైద్యాధికారులు, ఔషధ నియంత్రణ, విజిలెన్సు సంబంధిత అధికారులతో కూడిన 18 బృందాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ABOUT THE AUTHOR

...view details