ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Fine: ప్రైవేట్ ఆస్పత్రులకు రూ.11.30 కోట్లు జరిమానా - ఏపీలో ఆస్పత్రులపై జరిమానా

కొవిడ్ చికిత్సలో నిబంధనల ఉల్లంఘించి హద్దు దాటిన ప్రైవేట్​ ఆస్పత్రులపై విజిలెన్స్‌ కొరడా జులిపించింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 72 కేసుల్లో వివిధ ప్రైవేట్ ఆస్పత్రులకు జరిమానా విధించింది. ఇటీవల చేసిన దాడుల్లో రూ.11.30 కోట్ల మేర ప్రైవేట్ ఆస్పత్రుల నుంచి జరిమానా వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు.

vigilance attacks on hospital which not following government norms
vigilance attacks on hospital which not following government norms

By

Published : Jun 9, 2021, 2:17 PM IST

కొవిడ్ చికిత్సలో నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేట్ ఆస్పత్రులపై విజిలెన్సు దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 72 కేసుల్లో వివిధ ప్రైవేట్ ఆస్పత్రులకు జరిమానా విధించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇటీవల చేసిన దాడుల్లో రూ.11.30 కోట్ల మేర ప్రైవేట్ ఆస్పత్రుల నుంచి జరిమానా వసూలు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

మొత్తం 94 ఫిర్యాదుల్లో 72 ఫిర్యాదులు ఆస్పత్రుల్లో అవకతవకలపై వచ్చాయని వెల్లడించారు. ఆస్పత్రుల్లో ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు కంటే అధికంగా ఛార్జీలు వసూలు చేయటం, అత్యవసర ఇంజెక్షన్ల విషయంలో అవకతవకలపై ఈ ఫిర్యాదులు అందినట్లు ప్రభుత్వం తెలిపింది. ఆస్పత్రుల వెలుపల కూడా మరో 22 కేసులు నమోదు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. గుంటూరు జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రుల నుంచి అత్యధికంగా రూ.4.53 కోట్ల మేర జరిమానా వసూలు చేసినట్లు స్పష్టం చేసింది.

ఇదీ చదవండి:

ఆ కుర్రాడి లేఖకు.. సీజేఐ అచ్చెరువు..!

ABOUT THE AUTHOR

...view details