తెలంగాణలోని నిర్మల్ జిల్లా మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ భూలక్ష్మితో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఫోన్లో మాట్లాడారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం, స్థానిక పరిస్థితులపై భూలక్ష్మిని ఆరా తీశారు.
కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా తగ్గని దృష్ట్యా ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. ఉప రాష్ట్రపతి ఫోన్‌తో భూలక్ష్మి సంతోషాన్ని వ్యక్తం చేశారు.