తితిదే మాజీ ఛైర్మన్, బ్రహ్మయ్య అండ్ కో సంస్థలో సీనియర్ భాగస్వామి, సంయుక్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ సలహాదారు, హెరిటేజ్ ఫుడ్స్ ఇండిపెండెంట్ ఛైర్మన్ దేవినేని సీతారామయ్య మృతి పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, హిందూపూరం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంతాపం తెలిపారు. సీతారామయ్య క్రమశిక్షణ, అంకితభావంతో చేపట్టిన పదవులకు వన్నె తీసుకొచ్చారన్నారు. సీతారామయ్య ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
సీతారామయ్య మృతి పట్ల ప్రముఖుల సంతాపం - దేవినేని సీతారామయ్య లెటేస్ట్ న్యూస్
తితిదే మాజీ ఛైర్మన్, బ్రహ్మయ్య అండ్ కో సంస్థలో అరవై ఏళ్లుగా భాగస్వామిగా ఉన్న దేవినేని సీతారామయ్య ఆదివారం మృతి చెందారు. సీతారామయ్య మృతి పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు , హిందూపూరం ఎమ్మెల్యే బాలకృష్ణ సంతాపం తెలిరారు.
సీతారామయ్య మృతి పట్ల ప్రముఖుల సంతాపం