భారత జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య(pingali venkayya) జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(Venkaiah Naidu) నివాళులు అర్పించారు. జాతిని సంఘటితం చేసే శక్తి జాతీయ పతాకానికే ఉందని నమ్మి.. త్రికరణ శుద్ధిగా మువ్వన్నెల పతాకం కోసం ఆయన చేసిన కృషి గురించి యువతరం తెలుసుకోవాలని సూచించారు. సైనికుడిగా, స్వాతంత్య్ర సమరయోధునిగా, బహుభాషా కోవిదునిగా, వ్యవసాయ - ఖనిజ పరిశోధకునిగా అనేక రంగాల్లో తనదైన ముద్ర వేశారని కొనియాడారు.
వెంకయ్య దేశభక్తి, కార్యదీక్ష, సృజనాత్మక ఆలోచనలు, నిరాడంబర జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు. నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నానని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.