ఆంధ్ర షుగర్స్ సంస్థ వ్యవస్థాపకులు, మాజీ శాసనసభ్యులు ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ శతజయంతి సందర్భంగా ఆయనకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాళులర్పించారు. రాకెట్ ఇంధన తయారీ దేశంగా భారత్‌ను నిలపడంలో ముళ్లపూడి కృషి మరవలేనిదని గుర్తుచేశారు.
'రాకెట్ ఇంధన తయారీ దేశంగా భారత్‌ను నిలపడంలో ముళ్లపూడి కృషి మరవలేనిది' - Mullapudi latest news
ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ శతజయంతి సందర్భంగా ఆయనకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాళులర్పించారు. వ్యాపారం అంటే లాభార్జనే కాదు, ప్రజల సంక్షేమం కూడా అని ముళ్లపుడి భావించారని తెలిపారు.

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
వ్యాపారం అంటే లాభార్జనే కాదు, ప్రజల సంక్షేమం కూడా అని ముళ్లపుడి భావించారని వెంకయ్య నాయుడు తెలిపారు. అనేక సేవా కార్యక్రమాలతో శ్రీ హరిశ్చంద్రప్రసాద్ తమ దాతృత్వాన్ని చాటుకున్నారని ప్రశంసించారు. క్రమశిక్షణ, అంకితభావం, నిబద్ధతలతో గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామిక వెలుగులు నింపిన ముళ్లపుడి జీవితం యువతకు స్ఫూర్తిదాయకమైనదని కితాబిచ్చారు.
ఇదీ చదవండి:ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్‌కు నివాళలర్పించిన చంద్రబాబు, లోకేశ్