Venkaiah Naidu: తన కుటుంబంలో ఎవరూ చదువుకోకోపోయినా.. తాను ఉపరాష్ట్రపతి అయ్యానంటే దానికి కారణం.. నేర్చుకున్న విలువలు, క్రమశిక్షణే అని వెంకయ్య నాయుడు తెలిపారు. రామంతపూర్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ గోల్డెన్ జూబ్లీ వేడుకలను వెంకయ్యనాయుడు ప్రారంభించారు. విద్యార్థులకు సమయ పాలన, క్రమశిక్షణ ఉండాలని వెంక్యయనాయుడు పేర్కొన్నారు. దేశంలో విద్యారంగం అభివృద్ధి చెందినా.. ఇంకా చాలా మంది పిల్లలు చదువు కోసం విదేశాలకు వెళ్తున్నారన్నారు. ఒకవేళ వెళ్లినా తిరిగి వచ్చి మాతృభూమికి సేవ చేయాలని సూచించారు. పిల్లలకు విద్యతో పాటు విలువలు కూడా నేర్పించాలని ఉపాధ్యాయులకు వెంకయ్యనాయుడు మార్గనిర్దేశం చేశారు.
దేశంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారు మాతృభాషలోనే చదువుకున్నారు-వెంకయ్యనాయుడు - హైదరాబాద్ తాజా వార్తలు
Venkaiah Naidu: తెలంగాణ రామంతపూర్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ గోల్డెన్ జూబ్లీ వేడుకలను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. పిల్లలకు విద్యతో పాటు విలువలు కూడా నేర్పించాలని ఉపాధ్యాయులకు వెంకయ్యనాయుడు మార్గనిర్దేశం చేశారు.
![దేశంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారు మాతృభాషలోనే చదువుకున్నారు-వెంకయ్యనాయుడు vice president](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15967675-613-15967675-1659174607611.jpg)
vice president
"ఒక అబ్బాయి అడిగాడు.. పైకి రావాలంటే మాతృభాష కాకుండా ఇతర భాషలు నేర్చుకోవాలంటా కదా అని. ఇతర భాషలు నేర్చుకో అభ్యంతరం లేదు. కానీ.. అసలు అమ్మభాషను మర్చిపోకూడదని చెప్పాను. నేను మాతృభాషలో చదువుకున్నాను .దేశంలో ఉన్నత స్థానాల్లోని వారు మాతృభాషలోనే చదువుకున్నారు." -వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి
vice president
ఇవీ చదవండి:'"మధ్యనిషేధమా"?.. మా మ్యానిఫెస్టోలో లేదు: మంత్రి అమర్నాథ్